
ఈ రోజుల్లో ఎక్కువ మంది వయస్సు మళ్ళినవాళ్ళు బాదపడే ఒక శారీరక రుగ్మత!!!!!
Spondylosis వెన్నునొప్పి:
మెడదగ్గర వెన్ను భాగాలు అరిగి నొప్పి వస్తే సర్వైకల్ స్పాండిలోసిస్ అంటుంటారు కొందరు. అలాగే వెన్ను కిందభాగంలో అరుగుదల సంభవిస్తే లంబార్ స్పాండిలోసిస్ అంటుంటారు. సరైన కారణం తెలియకుండా వెన్నుపూసలు, డిస్క్ అరుగుదలవల్ల వెన్ను నొప్పి వస్తుంటే స్పాండిలోసిస్ అంటారు. స్పైన్ దెబ్బతిని వెన్ను నొప్పి రావడాన్నికూడా స్పాండిలోసిస్ అంటారు. మెడ పాంతంలో గానీ నడుము ప్రాంతంలోగానీ ఆస్టియో ఆర్థరైటిస్ వల్ల ఎముకలు అరిగితే దాన్ని స్పాండిలోసిస్ అంటున్నారు. నడుము లేక మెడ, ప్రాంతంలో డిస్క్‌లు అరిగినా స్పాండిలోసిస్ అనే వాడుతున్నారు. ఇలా ఇన్ని రకాల మెడ, నడుం వెన్నులోపాలకి స్పాండి లోసిస్ అని వాడుతున్నారు. చాలా బ్రాడ్‌గా వయస్సును బట్టి వెన్ను అరగడం...