Friday, 12 January 2018

SPONDYLOSIS ......

ఈ రోజుల్లో ఎక్కువ మంది వయస్సు మళ్ళినవాళ్ళు బాదపడే ఒక శారీరక రుగ్మత!!!!!

Spondylosis వెన్నునొప్పి:

మెడదగ్గర వెన్ను భాగాలు అరిగి నొప్పి వస్తే సర్వైకల్‌ స్పాండిలోసిస్‌ అంటుంటారు కొందరు. అలాగే వెన్ను కిందభాగంలో అరుగుదల సంభవిస్తే లంబార్‌ స్పాండిలోసిస్‌ అంటుంటారు. సరైన కారణం తెలియకుండా వెన్నుపూసలు, డిస్క్‌ అరుగుదలవల్ల వెన్ను నొప్పి వస్తుంటే స్పాండిలోసిస్‌ అంటారు. స్పైన్‌ దెబ్బతిని వెన్ను నొప్పి రావడాన్నికూడా స్పాండిలోసిస్‌ అంటారు. మెడ పాంతంలో గానీ నడుము ప్రాంతంలోగానీ ఆస్టియో ఆర్థరైటిస్‌ వల్ల ఎముకలు అరిగితే దాన్ని స్పాండిలోసిస్‌  అంటున్నారు.  నడుము లేక మెడ, ప్రాంతంలో డిస్క్‌లు అరిగినా స్పాండిలోసిస్‌ అనే వాడుతున్నారు. ఇలా ఇన్ని రకాల మెడ, నడుం  వెన్నులోపాలకి స్పాండి లోసిస్‌ అని వాడుతున్నారు. చాలా బ్రాడ్‌గా వయస్సును బట్టి వెన్ను అరగడం సర్వసాధారణం. నిజానికి 60 సంవత్సరాలు పైబడి న వాళ్ళలో వెన్నెముక అరిగిపోయి స్పాండిలోసిస్‌ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఎం.ఆర్‌.ఐ లేక సి.టి. స్కాన్‌ లతో స్పాండిలోసిస్‌ని గుర్తించ గలుగుతాం.

వెన్నునొప్పికి కారణాలు చాలా ఉన్నాయి:

 వెన్నుపూసల మధ్య నుంచి నరాలు వెళ్ళడానికి దారి ఉంటుంది. ఈ దారి సన్ననయితే నరాల మీద ఒత్తిడి పడి నొప్పి వస్తుంది. దీన్ని నెర్వల్ స్పైనోసిస్‌ అంటారు. రోగి నడిచే టప్పుడు కాళ్ళ నొప్పి వస్తుంటుంది. కాళ్ళల్లో, చేతుల్లో, జాయింట్స్‌ వున్నట్టుగానే వెన్నులో కూడా జాయింట్స్‌ఉంటాయి.ఈ జాయింట్స్‌ కూడా ఆస్టియా ఆర్ధరైటిస్‌ వల్ల అరగ వచ్చు. అప్పుడూ నొప్ప వస్తుంది. డిస్క్‌లు అరగడం వల్ల కూడా నొప్పి కలగవచ్చు. డిస్క్‌లో వాటర్‌ తగ్గి దాని పనిని అది పూర్తి చేయలేక పోవడాన్ని డిస్క్‌ అరుగుదలగా చెప్పుకోవచ్చు. దీని వల్ల మెడలోనూ, నడుము క్రింద భాగంలో నొప్పి రావచ్చు. ఆ నొప్పికాళ్ళల్లోకి చేతు ల్లోకి రావచ్చు.

 నొప్పికి కారణాలు చెప్పుకున్నాం కదా. ఒక్కో కారణానికి వైద్యం ఒక్కో విధంగా ఉంటుంది. కాబట్టి స్పాండి లోసిస్‌ లేక వెన్ను అరుగుదల అని చెప్పడం వల్ల ఉపయోగం ఉండదు. ఆ అరుగుదల లేక నొప్పి ఎందు కొచ్చిందో తెలుసుకొని దానికి తగ్గట్టు వైద్యం చేయాలి. అందుకే ఈ వివరాల్ని తెలుసుకున్న తరువాత వైద్యులు ఒక నిర్ణయానికొస్తారు.  రోగి ఆరోగ్య చరిత్ర-నొప్పి ఎలా వస్తుంది. ఇంకా ఇతర లక్షణాలు ఏమున్నాయి. ఏ ప్రాంతంలో నొప్పి వస్తోంది. ఏ స్థాయిలో వస్తోంది. ఏ పనుల వల్ల పెరుగుతోంది లేక తగ్గుతోంది తెలుసుకుంటారు.

 నొప్పికి కారణం తెలుసుకోవడానికి కొన్ని భౌతిక పరీక్షలని చేస్తారు.  ఎం.ఆర్‌.ఐ స్కాన్‌, సిటిస్కాన్‌ లేక ఎక్స్‌రే లాంటి పరీక్షలు చేయించి పరి శీలిస్తారు. నొప్పి తగ్గడానికి అవసర మైనచోట కొన్ని ఇంజెక్షన్‌లు చేస్తారు. వీటిని బట్టి రోగ నిర్థారణ చేస్తారు. అది డీజనరేటివ్‌ డిస్కో, ఆర్థరైటిసో, స్పైనల్‌ స్టినోసిసో కారణం ఏంటనేది తెలుసుకుంటారు.

 కాబట్టి స్పాండిలోసిస్‌ అనేది రోగ నిర్ధారణకు వాడే సరైన పదం కాదు. సరైన కారణం ఏమిటో నిర్ధారిస్తేనే సరైన చికిత్స చేయడానికి వీలవు తుంది. మెడనొప్పి చేతుల్లోకి వ్యాపిం చడం, నడుంనొప్పి కాళ్ళల్లోకి వ్యాపించవచ్చు. ఇలా వెన్ను ప్రాంతం నుంచి కాళ్ళు, చేతుల్లోకి నొప్పి వ్యాపి స్తుంటే దాన్నిఖచ్చితంగా వెన్ను తాలూకు ఇబ్బందేనని గుర్తించాలి. అనుభవజ్ఞులైన వైద్యుల వద్దకి సకాలంలో వెళ్ళి సరైన రోగ నిర్థారణ జరిగేలా చూసుకోవాలి. సరైన రోగ నిర్ధారణ జరిగినప్పుడే సరైన చికిత్సా దొరుకుతుంది. తిరిగి ఆరోగ్యాన్ని పొందగలం.

చికిత్స :
ఈ సమస్యను మందుల ద్వారా సులభంగానే నయం చేయవచ్చు. కాన్‌స్టిట్యూషనల్ పద్ధతిలో మందులు వాడటంతో పాటు కొన్ని స్వల్ప ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది. దాంతో పాటు అవసరమైతే సులభమైన వ్యాయామం చేయడం ద్వారా సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుంది. అయితే ఇటువంటి సమస్యలకు సమస్య తీవ్రతను బట్టి నయం అవడానికి 6 నెలల నుండి ఏడాదిన్నర (18 నెలలు) వరకు సమయం పట్టవచ్చును.

Courtesy : Mahesh neauro center, Nellore.

0 comments:

Post a Comment

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | Facebook Themes