మంచి article చదివి తెల్సుకోవలసిన విషయం📖!!!👌👌
అలసట ( FATIGUE )
మానవ శరీరము ఒక అద్బుతం . ఇది నిరరంరం పనిచేసే వ్యవస్థ . ఇందులో మెదడు కీలకపాత్ర వహిస్తుంది . నిరంతర అలసటతో బాధపడేవారు మెదడు ను నియంత్రించే చికిత్సతో తిరిగి కొత్తశక్తిని పొంది రెట్టింపు వుత్సాహము తో పనిచేయగలుగుతారు . అలసట అందరికీ కలిగే అనుభవమే . ఆటలు ఆడిన పిల్లలు అలసిపోయి ఇంటికి వస్తారు . సాయంత్రం 3 గంటలు చదివిన పిల్లలు అలసి పోతారు . ఆఫీసుపనితో మగవారు , ఇంటిపనితో ఆడవారు అలసిపోవడం సహజము . అలసిపోగానే నీరసం వస్తుంది . ఆకలి వేస్తుంది .. నిద్రవస్తుంది . ఇలాంటి సాధారణ అలసట నుండి సులభముగానే బయట పడతాం కాస్త నిద్రపోతే ఇట్టే పోతుంది . కాని దీనికి భిన్నమైన అలసట తో ఇప్పుడు చాలామంది బాధపడుతున్నారు . ఈ అలసట అందరకూ ఉండదు . ఉదయం పక్కమీదనుండి లేవలేనంత నీరసం వారిని వేధిస్తుంది . లేచి అడుగులు వేయడానికి ఎలాంటి ఉత్సాహము ఉండదు . కాసేపు పనిచేసేసరికి ఇట్టే అలసిపోతారు . పనిచేయాలనిపించదు . జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది . ఏపని చేయాలన్నా అలసటగా ఉందంటారు . కారణం లేకుండా కలిగే అలసటను వైద్యశాస్త్రం లో " క్రానికల్ ఫెటిగ్ సిండ్రోం " అంటారు .
ఇప్పుడు పలుచోట్ల ఏనోట విన్నా ఒకటేమాట. అలసిపోవటం, మెట్లక్కితే ఆయాసం, బస్ కోసం కాస్త దూరం నడిస్తే ఒగుర్పు, ఇంట్లో వాషింగ్ మెషిన్ వున్నా, బట్టలు ఉతికించడానికి ఓపికలేక పోవటం, అంతెందుకు టీవీలో సిరియల్ తర్వాత లైట్ స్విచ్ 'ఆఫ్' చేయడానికి బద్దకం. కొందరి ఇళ్లల్లో ట్రెడ్‌మిల్స్ బట్ట లు ఆరేసుకోవటానికే.
ఎందుకు వస్తుంది .
మనిషి శరీరానికి ఏర్పడే పలురకాల ఇబ్బందులను సరిదిద్దే వ్యవస్థ అంతర్గతం గా ఉంటుంది . అయితె మనుషులు తమ అలవాట్లతో ఆ వ్యవస్థను తమకు తాముగా దెబ్బతీస్తున్నారు . శరీరానికి అవసరమైన శక్తిని సక్రమముగా అందించకపోవడం తొలి పొరపాటు . ఈ కింద కొన్ని పొరపాట్లు అలసటకు దారితీస్తుంది .
వేళకు భోజనం చేయకపోవడం ,
వేళకాని వేళలో భోజనం చేయడం ,
పోషక పదార్ధాలు అందించకపోవడం ,
చీటికి మాటికీ వైద్యసలహా లేకుండా మందులు మింగడం ,
తగినంత నిద్ర పోకపోవడం ,
మత్తుపానీయాలు అతిగా సేవించడం ,
సరిగా వ్యాయామము చేయకఫోవడం ,
‘అబ్బ ఎంత అలిసిపోయాను. ఎంత పని చేశాను. కానీ శారీర కంగా బాగానే వున్నా ను’ అని అనుకున్న రోజులు దాదాపుగా వుండవు. 30 నిమిషాల్లో తేల్చవలసిన బ్యాలెన్స్ షీటును చక్క బెట్టడానికి కనీసం ఓ గంట సేపు పడుతున్న సందర్భాలు ఎదుర వుతాయి. అప్పుడప్పుడు సులువైన పనులే పెద్ద బ్రహ్మాండాలై కూర్చుంటుంటాయి..! ఇదే గనుకే అస్తమానం రిపీట్ అయితే ‘క్రానీక్ ఫెటీగ్ సిన్డ్రోమ్’ అనే మానసిక వ్యాధికి దారి తీస్తాయని ముంబై కి చెందిన మనోరోగ నిపుణురాలు పారుల్ అగర్వాల్ అంటున్నారు. ఆదరాబాదరా హడావిడి జీవితం పుణ్యమా... అని చాలా మంది అలసట వల్ల ప్రభావితులవుతున్నారు. పోటీ వల్ల కష్టపడి పనిచేస్తున్నారు, ఫలితంగా అలసిపోయి రోజువారీ పనులే ఎంతో భారం అనిపిస్తాయి అని వివరిస్తోంది.
అలసట లక్షణాలు... :
త్వరగా సులువుగా పూర్తిచేసే పనులు చేయడానికి ఎక్కువ సమయం వెచ్చిస్తారు. తరచూ మానసికంగా తలుపులు మూసుకుపోతాయి. ప్రతిదీ ఒక పని అనిపిస్తుంది. ఏదీ ఆహ్లాదాన్నివ్వదు.మరిచిపోతుంటారు, మనసు దిగులుగా విషాదంగా ఉంటుంది, ఎప్పుడూ కీళ్ళ నొప్పులు ఒంటినొప్పి నిద్రలేనితనం ఉంటాయి, ఉదయాన్నే నిద్రలేచి మీపనులు మీరు చేసుకోలే పోతారు, థైరాయిడ్‌లోపం గానీ ,విటమిన్ బి12 కొరవడడం వల్ల కూడా అలసట తలెత్తుతుంది. ఏవైనా లోపాలుంటే పసిగట్టడం కోసం సమగ్ర ఆరోగ్య పరీక్ష చేయించుకోవడం మంచిది.
ఎదుర్కొనే మార్గాలు... :
అలసటను ఎదుర్కొనే వ్యూహాలను అల వరుచుకుని ప్రతి సందర్భాన్నీ వాస్తవ దృష్టితో పరిశీలించాలి. అందు లో హేతుబద్ధంగా కూడా ఆలోచించాలి అని అగర్వాల్ సలహా ఇస్తున్నా రు. సానుకూలంగా ఆలోచించడం ప్రారంభిస్తే దీర్ఘకాలికంగా పరిస్థితులను మెరుగ్గా ఎదుర్కొంటారు. తాత్కాలికం అని భావిస్తే ఈ పరిస్థితిని అలక్ష్యం చేయరాదు. అలా చేసినట్లయితే పరిస్థితి చేయిదాటిపోయి మానసిక, శారీరక సమస్యలకు దారితీయవచ్చు అని డా.ఆహుజా అంటున్నారు. కోల్పోయిన జవసత్వాలను తిరిగి పొందడానికి ఆమె జీవన శైలిలో తీసుకురావలసిన కొన్ని మార్పులను సూచిస్తున్నారు.
అలసటకు కారణం...?
మనకి శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తుంటాయి. ఈ లక్షణాలన్నీ అరోగ్యానికి చెందినవి కాకపోవచ్చు. శరీరంలో కొన్ని లోపాలని మనకు తెలియజేయాలి అన్నట్లు కొన్ని లక్షణాలు కనిపించవచ్చు. ఈ లక్షణాలు అకారణంగా ఉన్నా, చాలాకాలంగా బాధిస్తున్నా, వీటితోపాటు ఇతరత్రా ఆరోగ్య సమస్యలు బాధిస్తున్నా, ఈ లక్షణాలవల్ల దైనందిన జీవితం కష్టమవుతున్నా వెంటనే వైద్యుల సలహా తీసుకోవలసిన అవసరం ఉంది.
Courtesy : Mahesh neuro center, Nellore

0 comments:
Post a Comment